పవన్ కళ్యాణ్ వైఫ్‌గా అంజలి?

by  |
పవన్ కళ్యాణ్ వైఫ్‌గా అంజలి?
X

దిశ, వెబ్‌డెస్క్: సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో బిగ్ ప్రాజెక్ట్ డీల్ చేస్తుంది. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా అఫియల్ అనౌన్స్ కాగానే ఇందులో నటీనటుల గురించి రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

పవన్‌తో‌పాటు రానా నటిస్తాడని వార్తలు వచ్చినా.. నితిన్ పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అన్న వార్త అభిమానులకు కిక్ ఇస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్‌తో జోడీ కట్టేది ఎవరు అనేది చర్చనీయాంశం అయింది. తెలుగు అమ్మాయి అంజలి పవన్ భార్యగా నటించబోతుంది అని ఫిల్మ్‌నగర్ టాక్. అరకు ఫారెస్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్‌లో సినిమా రాబోతుండగా.. సాగర్.కే.చంద్ర డైరెక్ట్ చేయబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. కాగా, అంజలితోపాటు ఫీమేల్ లీడ్‌గా సాయి పల్లవి పేరు కూడా వినిపిస్తుంది.



Next Story

Most Viewed