డబ్బు కోసం దిగజారిపోయిన సోనమ్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన తండ్రి

by  |
డబ్బు కోసం దిగజారిపోయిన సోనమ్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన తండ్రి
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్‌ ‘పించ్’ సెకండ్ సీజన్‌కు గెస్ట్‌గా హాజరయ్యారు. అర్బాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో… కూతురు సోనమ్ కపూర్‌తో పాటు తనను ట్రోల్ చేసిన వారికి కామ్‌గా సమాధానమిచ్చాడు అనిల్ కపూర్. ‘ డబ్బు కోసం తండ్రీకూతుళ్లు ఎంతటికైనా దిగజారుతారు’ అన్న కామెంట్‌పై స్పందించిన కపూర్.. ఆ టైమ్‌లో వారి మూడ్ బాగలేదేమో, అప్‌సెట్ అయి ఉన్నారేమో అని చెప్పాడు. 64 ఏళ్లలోనూ ఇంత ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తున్న అనిల్ జీ.. ఇందుకు సంబంధించిన సీక్రెట్స్ కూడా షేర్ చేశాడు. డబ్బులు పెట్టి, ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమా చూసేందుకు వచ్చే ఆడియన్స్‌ను డిజప్పాయింట్ చేయడం ఇష్టం లేదని.. అందుకే ఈ హెయిర్ కలర్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటూ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చాడు.


Next Story

Most Viewed