వేదాంతాకు కొత్త డైరెక్టర్!

by  |
వేదాంతాకు కొత్త డైరెక్టర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మైనింగ్ మెటల్ సంస్థ వేదాంతా సంస్థకు తొలిసారిగా అనిల్ అగర్వాల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఈ బాధ్యతలను ఆయన సోదరుడు నవీన్ అగర్వాల్ నిర్వహించారని, అనీల్ అగర్వాల్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్టు వేదాంతా లిమిటెడ్ ప్రకటించింది. నవీన్ అగర్వాల్‌ను ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా నియమించామని వివరించింది. ఇటీవల వేదాంత లిమిటెడ్ సీఈవోగా ఉన్న ఎస్. వెంకటకృష్ణన్ పదవి నుంచి వైదొలగడంతో సంస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని సంస్థ పేర్కొంది. అంతేకాకుండా, వేదాంతా లిమిటెడ్ సంస్థ సీఈవోగా హిందూస్తాన్ జింక్‌కు హెడ్‌గా ఉన్న సునీల్ దుగ్గల్‌ను నియమించినట్టు తెలిపింది.

Tags : Vedanta Resources, Companies, Vedanta, Vedanta Limited, Hindustan Zinc, Anil Agarwal

Next Story

Most Viewed