- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సీక్రెట్స్ బయటపెట్టిన ఏంజెలీనా జోలి..
<p>దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ నటి ఏంజెలీనా జోలి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. స్టార్ యాక్టర్ బ్రాడ్ పిట్‌తో పెళ్లి సందర్భంగా ఆమె తన ఫ్యామిలీ సేఫ్టీ గురించి భయపడినట్లు వెల్లడించింది. 2014లో మ్యారేజ్ చేసుకోవడానికి ముందు ఈ మాజీ కపుల్ పదేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2016లో విడిపోయిన ఈ జంటకు 2019లో విడాకులు మంజూరయ్యాయి. అయితే తమ ఆరుగురు పిల్లల(ముగ్గురు అడాప్టెడ్) సంరక్షణ విషయంలో ఈ స్టార్ యాక్టర్స్ మధ్య ఇప్పటికీ […]</p>

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ నటి ఏంజెలీనా జోలి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. స్టార్ యాక్టర్ బ్రాడ్ పిట్‌తో పెళ్లి సందర్భంగా ఆమె తన ఫ్యామిలీ సేఫ్టీ గురించి భయపడినట్లు వెల్లడించింది. 2014లో మ్యారేజ్ చేసుకోవడానికి ముందు ఈ మాజీ కపుల్ పదేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2016లో విడిపోయిన ఈ జంటకు 2019లో విడాకులు మంజూరయ్యాయి. అయితే తమ ఆరుగురు పిల్లల(ముగ్గురు అడాప్టెడ్) సంరక్షణ విషయంలో ఈ స్టార్ యాక్టర్స్ మధ్య ఇప్పటికీ వివాదం సమసిపోలేదు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో పిల్లల హక్కుల గురించిన మాట్లాడిన ఏంజెలీనా.. బ్రాడ్‌తో తన పెళ్లి సందర్భంగా పిల్లల భవిష్యత్ పట్ల భయపడ్డారా? అనే ప్రశ్న ఎదుర్కొంది.
దీనికి ఔనని తలూపిన స్టార్ యాక్ట్రెస్.. వారి సంరక్షణకు సంబంధించి లీగల్ ఇష్యూస్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై మాట్లాడే అవకాశం లేదని తెలిపింది. అయితే డైవోర్స్ తీసుకుని తను, పిల్లలు బ్రాడ్ నుంచి విడిపోవడం మాత్రం అంత సులభమైన నిర్ణయం కాదని అభిప్రాయపడింది.






