నా భర్త నన్ను వేధించేవాడు.. అందుకు నా పిల్లలే సాక్ష్యం – హాలీవుడ్ నటి

by  |
నా భర్త నన్ను వేధించేవాడు.. అందుకు నా పిల్లలే సాక్ష్యం – హాలీవుడ్ నటి
X

దిశ,వెబ్ డెస్క్: హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ తన భర్త బ్రాడ్ పిట్ తో విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. 2016 లో కోర్టుకెళ్లిన ఈ కేసు ఇప్పటికీ విచారణ జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఏంజెలినా భర్తపై మరో కేసు పెట్టింది. బ్రాడ్ పిట్ తనను వేధిస్తున్నాడంటూ అతనిపై గృహ హింస కేసు పెడుతూ పిటిషన్ దాఖలు చేసింది. పెళ్లి అయిన దగ్గరనుండి అతను నన్ను వేధిస్తున్నాడు. దీనికి నా పిల్లలే సాక్షం. నన్ను ఎంత వేధించాడో.. వారిని అడగండి. కావాలంటే వారు కోర్ట్ కి వచ్చి సాక్షం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని పిటిషన్ లో పేర్కొంది.

ఇకపోతే 2004 లో ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ చిత్రంతో మొదలైన వీరి ప్రేమ 2014 లో వివాహంతో ముగిసింది.ముచ్చటగా మూడేళ్లు కూడా పూర్తికాకముందే రెండేళ్లకే తనకు విడాకులు కావాలని ఏంజెలినా కోర్టుకెక్కింది. అప్పటినుండి వీరివురు కోర్టులోనే కొట్లాడుకుంటున్నారు. ఇప్పటికీ వీరికి విడాకులు రాకపోవడం గమనార్హం.

Next Story

Most Viewed