ఇదొక చెత్త ఫ్రాంచైజీ : ఆండ్రీ రస్సెల్

by  |
ఇదొక చెత్త ఫ్రాంచైజీ : ఆండ్రీ రస్సెల్
X

దిశ, స్పోర్ట్స్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జమైకా తలవాస్ ఫ్రాంచైజీపై విరుచుకుపడ్డాడు. ‘అదొక చెత్త ఫ్రాంచైజీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పటి వరకు ఎన్నో జట్ల తరపున క్రికెట్ ఆడాను. కానీ జమైకా లాంటి విచిత్రమైన జట్టును తాను చూడలేదని’ రస్సెల్ మండిపడ్డాడు. జమైకా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న రామ్ నరేష్ శర్వాన్‌పై రెండు రోజుల క్రితమే క్రిస్ గేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఇప్పుడు అదే జట్టుపై రస్సెల్ ఆరోపణలు గుప్పిస్తుండటం గమనార్హం. పైగా తాను ఇదేదో ఊరికే చేస్తోన్న ఆరోపణ కాదని, సీరియస్‌గా చెబుతున్నానంటూ ఆ జట్టు గురించి పలు విషయాలను వెల్లడించాడు.

‘ఈ జట్టుతో సుదీర్ఘ కాలంగా ప్రయాణం చేస్తున్నా.. కానీ వారి ఆలోచనా విధానం ఏమిటో ఇంత వరకూ అర్థం కాలేదు. ఒకప్పుడు ఇదే జట్టు లీడర్ టీమ్‌లో సభ్యుడిగా యాజమాన్యాన్ని దగ్గర నుంచి గమనించా. ఆ జట్టు తరపున ఆడటం కంటే ఖాళీగా కూర్చోవడం ఉత్తమం, ఇప్పటికైనా యాజమాన్యం తన తీరును మార్చుకోకపోతే జమైకా జట్టు మనుగడ కష్టమే’ అని రస్సెల్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న రస్సెల్.. ఎన్నో సార్లు జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు.

Tags : Andre Russell, IPL, IPL, Cricket, Jamaica Tallawahs, West Indies

Next Story