- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రణరంగంలా పులివెందుల ZPTC ఉప ఎన్నిక.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఒకే ఒక్క జడ్పీటీసీ స్థానానికి ఏకంగా 11 మంది పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి (Mareddy Latha Reddy), వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి (Hemanth Reddy), కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి (Shiva Kalyan Reddy)తో పాటు మరో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట కావడంతో వైసీపీని గెలిపించేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు స్వయంగా రంగంలోని దిగారు. ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇవాళ పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడయాతో మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఎన్నికను తాము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలిపారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల అడ్డా అని అభివర్ణించారు. ఆ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టేందుకే తాను పులివెందులకు ప్రచారానికి వచ్చానని స్పష్టం చేశారు. ఇక్కడ పోటీ చేస్తోంది బీటెక్ రవి భార్య లతారెడ్డి కాదని.. పరోక్షంగా చంద్రబాబే (Chandrababu) పోటీ చేస్తున్నాడని కామెంట్ చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో అనేక స్థానాల్లో తన పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో అసెంబ్లీ సాక్షిగా.. చంద్రబాబే నిధులన్నీ పులివెందులకేనా అని అన్నారని, మరి నేడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.






