బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరపాలి: వైవీ సుబ్బారెడ్డి

by velandi.Saikiran |

ఎన్నికలు (Elections) పారదర్శకంగా జరగాలంటే బ్యాలెట్ విధానంలో (Ballot System) నిర్వహించాలని డిమాండ్ చేశారు వైవీ

బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరపాలి: వైవీ సుబ్బారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలు (Elections) పారదర్శకంగా జరగాలంటే బ్యాలెట్ విధానంలో (Ballot System) నిర్వహించాలని డిమాండ్ చేశారు వైవీ సుబ్బారెడ్డి ( Yv Subba reddy). ఏపీలో EVM లపై అనుమానం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసారు వైసీపీ ముఖ్య నేతలు. రానున్న ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కోరారు వైసీపీ నాయకులు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం అమల్లో ఉందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈవీఎంలపై (EVM ) ఉన్న టెక్నికల్‌ అనుమానాలపై ఈసీకి వివరించామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్‌ శాతంపై వివరణ కోరామని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.

ఓటర్ లిస్టు, పోలింగ్ సరళి తదితర అంశాలపై ఈసీతో చర్చించామన్నారు. 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఇది ఇలా ఉండగా.. ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకు వైసిపి పార్టీ పరిమితమైంది. దీంతో అప్పటినుంచి... ఈవీఎంలో కాకుండా... బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికల నిర్వహించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story