యువగళ - 2కే26లో సంద‌డి చేసిన మెగా డాట‌ర్‌ నిహారిక‌

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-21 14:54:40  IST  )

యువజన ఉత్సవాల రెండో రోజులో భాగంగా శ‌నివారం ఓడ‌ల‌రేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో యువగళ - 2కే26 కార్య‌క్ర‌మం అత్యంత ఘ‌నంగా జ‌రిగింది..

యువగళ - 2కే26లో సంద‌డి చేసిన మెగా డాట‌ర్‌ నిహారిక‌
X

దిశ‌, అల్ల‌వ‌రం: యువజన ఉత్సవాల రెండో రోజులో భాగంగా శ‌నివారం ఓడ‌ల‌రేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో యువగళ - 2కే26 కార్య‌క్ర‌మం అత్యంత ఘ‌నంగా జ‌రిగింది. జాతీయస్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీల్లో విద్యార్థిని, విద్యార్థులు విశేష ప్రతిభను కనబరిచారు. విద్యార్థుల నృత్య, సంగీత, పాటల ప్రదర్శనలతో పాటు ఖోఖో, కబడ్డీ, టేబుల్ టెన్నిస్ వంటి ఆటల పోటీలు నిర్వ‌హించారు..

బీవీసీ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో జరిగిన ఈ ఉత్సవాలకు మెగా డాట‌ర్‌ ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణెదల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విద్యార్ధుల‌నుద్దేశించి మాట్లాడి వారిలో జోష్ నింపారు. నిహారిక నిర్మాణ సార‌ధ్యంలో తెర‌కెక్కుతోన్న రాకాస చిత్రం గ్లింప్స్‌, సాంగ్‌ను బీవీసీ యువ‌గ‌ళ వేదిక‌గా విడుద‌ల చేశారు. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, సింగర్ అనుదీప్ దేవ్, సాహితీ గాలిదేవర లతో సంగీత విభావరి నిర్వహించారు.

ప్రముఖ సినీ హీరో సంగీత్ శోభన్ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసి రంజింపజేశారు. పోటీల్లోని విజేతలకు బ‌హుమ‌తులు, ప్రశంస పత్రాలు అందజేశారు. కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ బోనం కనకయ్య, చైర్ పర్సన్ డాక్టర్ బోనం కనకదుర్గ, విద్యార్థులను నిర్వాహకులను అభినందించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ డి.మహేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ మరియు ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఏ ప్రవీణ్ , కార్యనిర్వహణాధికారి ఏవీఆర్‌వీ ప్రసాద్ వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వందన సమర్పణతో కార్య‌క్ర‌మం ముగిసింది.

Next Story