YSRCP : రేపు వైసీపీ యువత పోరుబాట

by Muthe.Rajitha |

వైసీపీ(YSRCP) యువజన విభాగం ఆధ్వర్యంలో రేపు ఏపీలో 'యువత పోరు'(Yuvatha Poru) పేరిట రాష్ట్రవ్యాప్త నిరసనలు నిర్వహించనుంది.

YSRCP : రేపు వైసీపీ యువత పోరుబాట
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ(YSRCP) యువజన విభాగం ఆధ్వర్యంలో రేపు ఏపీలో 'యువత పోరు'(Yuvatha Poru) పేరిట రాష్ట్రవ్యాప్త నిరసనలు నిర్వహించనుంది. నిరుద్యోగ భృతి విడుదల, 20 లక్షల ఉద్యోగాల సృష్టి, మెగా DSCలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ వంటి 'సూపర్ సిక్స్' ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ నిరసనలు జరగనున్నాయి. ఇందులో భాగంగా అమరావతి, తిరుపతి, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం వంటి పలు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, వినతిపత్రాల సమర్పణతో ఈ కార్యక్రమం జరగనుంది. వైసీపీ నాయకుడు గుడివాడ అమర్‌నాథ్(Gudivada Amarnath) ఈ నిరసనలకు పిలుపునిచ్చారు.

కాగా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా(Jakkampudi Raja), విద్యార్థి విభాగం అధ్యక్షుడు పనుగంటి చైతన్య నేతృత్వంలో జరిగే ఈ నిరసనలు వైసీపీ రాజకీయ బలోపేతానికి దోహదపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ నిరసనల కార్యక్రమం జూన్ 13న నిర్వహించాల్సి ఉండగా.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా వాయిదా వేసి, ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతోంది.

Next Story