వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలో చేరిన నలుగురు జడ్పీటీసీలు

by Vemula.Srinu Prasad |

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది...

వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలో చేరిన నలుగురు జడ్పీటీసీలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)లో వైసీపీ(Ycp)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి నలుగురు జడ్పీటీసీలు(Ztpc) రాజీనామా చేశారు. తాజాగా జనసేన(Janasena)లో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రజనీ పార్టీలో చేరారు. తాడేపల్లిగూడెం శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో పవన్ కల్యాణ్ చేస్తున్న కృషి, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమను అమితంగా ఆకట్టుకున్నాయని జెడ్పీటీసీలు తెలిపారు. వైసీపీలో గౌరవం లేదని, గత మూడున్నరేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్తామన్నారు.

Next Story