చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం.. తిరస్కరించిన వైసీపీ

by Vemula.Srinu Prasad |

టీడీపీ కార్యకర్త చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడాన్ని వైసీపీ తిరస్కరించింది..

చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం.. తిరస్కరించిన వైసీపీ
X

దిశ, వెబ్ డెస్క్: 2022, జనవరి 13న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ(Tdp) కార్యకర్త తోట చంద్రయ్య హత్యకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చంద్రయ్య కుటుంబానికి టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి రావడంతో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం ఇచ్చేందుకు చట్ట సవరణ చేసే బిల్లుపై శనివారం శానసమండలి(Council)లో ఎమ్మెల్సీలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) ఎమ్మెల్సీలు నిరాకరించారు. ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఫ్యాక్షన్ నిర్మూలనలో భాగంగా చట్ట చేస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను పున:పరిశీలించాలని ఎమ్మెల్సీ బొత్స(MLC Botsa)ను కోరారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకే చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం ఇస్తున్నట్లు పయ్యావుల తెలిపారు. ఈ క్రమంలో చట్ట సవరణ బిల్లుపై డివిజన్ కోరుతున్నట్లు బొత్స ప్రకటించారు. దీంతో బిల్లును సమావేశాల చివరిలో తీసుకుంటామని మండలి ఛైర్మన్ మోషేన్ రాజు స్పష్టం చేశారు.

Next Story