YSRCP:వీర జవాన్ కుటుంబానికి వైసీపీ చెక్కు అందజేత

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-16 13:03:27  IST  )

దేశ రక్షణ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ సరిహద్దులో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

YSRCP:వీర జవాన్ కుటుంబానికి వైసీపీ చెక్కు అందజేత
X

దిశ,వెబ్‌డెస్క్: దేశ రక్షణ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ సరిహద్దులో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) ఈ నెల(మే) 13వ తేదీన వీర జవాన్ మురళీ నాయక్(Jawan Murali Nayak) కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తల్లిదండ్రుల కన్నీరు చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీర జవాన్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతి బాయిలకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు.

మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో వైసీపీ తరఫున రూ.25 లక్షల సాయం అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి ఇవాళ(శుక్రవారం) వైసీపీ రూ.25 లక్షల చెక్కును అందించింది. ఈ మేరకు మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, వైసీపీ నేతలు వీర జవాన్ కుటుంబానికి చెక్కును అందజేశారు.

Next Story