- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది ఇల్లు కాదు.. నారా మహల్: వైసీపీ నేత సంచలన ఆరోపణలు
అది ఇల్లు కాదు.. నారా మహల్ అని సీఎం చంద్రబాబు కొత్తగా నిర్మించుకుంటున్న చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrabu Naidu) అమరావతి(Amaravati)లో ఇల్లు నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఇంటికి ఇటీవల సతీమణితో కలిసి భూమి పూజ చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ఇంటి నిర్మాణంపై వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి(YSRCP official spokesperson Karumuru Venkata Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘అమరావతిలో చంద్రబాబు నిర్మిస్తోంది ఇల్లు కాదు.. ప్యాలెస్. 5 ఎకరాల్లో అత్యంత విలాసవంతంగా ఎన్నో వందల కోట్లతో తన కోసం నారామహల్‌ని చంద్రబాబు నిర్మించుకుంటున్నారు. అమరావతిలో ఆయన చెప్పిన ధరల ప్రకారం ఇంటి స్థలం విలువ దాదాపు రూ.150 కోట్లు ఉండొచ్చు. చంద్రబాబుకి ఇప్పటికే హైదరాబాద్ జూబ్లీహిల్స్, కొండాపూర్‌లో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. విజయవాడకి సమీపంలోని కరకట్టపై లింగమనేని గిప్ట్‌గా ఇచ్చిన అక్రమ ఇల్లు ఉండనే ఉంది. ఇప్పుడు ఇవి సరిపోవన్నట్లు అమరావతిలో ఇల్లు నిర్మిస్తున్నారు. ఓవరాల్‌గా చంద్రబాబుకి రూ.1500 కోట్లు పైగానే విలువైన ఇళ్లు ఉన్నాయి.’’ అని కారుమూరు వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ నేతలు సైతం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. జగన్‌కు ప్రతి ఊళ్లో ప్యాలెసులు ఉన్నాయని విమర్శిస్తున్నారు. అవినీతి సొమ్ము పెట్టి జగన్ ఎక్కడైనా ఇల్లు కట్టే సత్తా ఉందని సెటైర్లు వేస్తున్నారు.






