ఎంపీ మిథున్ రెడ్డికి ఊర‌ట‌.. న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్

by Vemula.Srinu Prasad |

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊర‌ట‌ లభించింది. ...

ఎంపీ మిథున్ రెడ్డికి ఊర‌ట‌.. న్యూయార్క్ పర్యటనకు లైన్ క్లియర్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి(Ycp Mp Midhun Reddy )కి ఏసీబీ కోర్టు(Acb)లో ఊర‌ట‌ లభించింది. న్యూయార్క్(New York) పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ మిథున్ రెడ్డి తరపున దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతించింది. పర్యటన అనంతరం కోర్టును సంప్రదించాలని ఆదేశించింది. కాగా అక్టోబర్ 26వ తేదీన పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో కలిసి ఎంపీ మిథున్ రెడ్డి అమెరికా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అనుమతివ్వాలంటూ మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.

Next Story