- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: హోంమంత్రి అనితకు వైసీపీ ఎమ్మెల్సీ స్ట్రాంగ్ వార్నింగ్
రాష్ట్ర హోంమంత్రి అనితపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర హోంమంత్రి అనిత(Home Minister Anita)పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి(YCP MLC Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్(YS Jagan) పుట్టిన రోజున తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) చోడవరం(Chodavaram)లో అరాచకం సృష్టించిన వైసీపీ నేతలపై పోలీసులు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడంపై ఆమె మండిపడ్డారు. అలాగే హోంమంత్రి అనిత(Home Minister Anita)కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై వరుద కల్యాణి ప్రశ్నల వర్షం కురిపించారు.
అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు..
ఆడ పిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాలన నచ్చినట్టు చేసుకోసుకోమని, హోంమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. గతంలో బాలకృష్ణ(Balakrishna) సినిమాకు సైతం మేకపోతులను బలి ఇస్తే అప్పుడు హోంమంత్రి ఎందుకు అరెస్టులు చేయలేదన్నారు. అభిమాన నాయకులపై ఒక్కో విధంగా ఒక్కొక్కరి తమ అభిమానాన్ని చాటుకుంటారని తెలిపారు. సినిమా డైలాగులు ఫ్లెక్సీపై వేస్తే అది నేరమా వరుదు కల్యాణి అని మండిపడ్డారు.






