ప్రభుత్వం ఉందా.. లేదా: ఎమ్మెల్సీ బొత్స సూటి ప్రశ్న

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా అని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు..

ప్రభుత్వం ఉందా.. లేదా: ఎమ్మెల్సీ బొత్స సూటి ప్రశ్న
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా అని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(YCP MLC Botsa Satyanarayana) ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి నాయకుల వ్యక్తి గత స్వార్థమే కనిపిస్తోంది తప్ప... రైతులకు న్యాయం చేయడం చేయడంలేదని మండిపడ్డారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయం తప్ప.. రాష్ట్ర సర్కారు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించిన బొత్స సత్యనారాయణ వైసీపీని, జగన్‌(Jagan)ను తిట్టడం తప్ప కూటమికి ఇంకోటేమీలేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విశాఖ ఉక్కు కోసం ఎందుకు కూటమి నాయకులు మాట్లాడటం లేదని నిలదీశారు. విశాఖ ఉక్కుపై కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

Next Story