Botsa-Pawan: అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం.. పవన్ ను హగ్ చేసుకున్న బొత్స

by Naga Rani Yarlagadda |

ఏపీ అసెంబ్లీ (AP Assembly) ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో డిప్యూటీ సీఎం పవన్ (Deputy CM Pawan) కారు ఎక్కేందుకు వెళ్తుండటం చూసి ఆయనకు ఎదురుగా నిలబడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స (YCP MLC Botsa) సత్యనారాయణ.

Botsa-Pawan: అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం.. పవన్ ను హగ్ చేసుకున్న బొత్స
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ (AP Assembly) ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో డిప్యూటీ సీఎం పవన్ (Deputy CM Pawan) కారు ఎక్కేందుకు వెళ్తుండటం చూసి ఆయనకు ఎదురుగా నిలబడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స (YCP MLC Botsa) సత్యనారాయణ. పవన్ ను చూసి పెద్దిరెడ్డి, మిగతా వైసీపీ ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోగా.. బొత్స సత్యనారాయణ మాత్రం అక్కడే నిలబడి నమస్కారం చేశారు. ఆయన స్పందనను చూసిన పవన్ కల్యాణ్.. ఎదురెళ్లగా.. తనవైపుగా వచ్చిన పవన్ ను చూసి.. బొత్స హగ్ చేసుకున్నారు. ఈ పరిణామం అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచింది.

Next Story