- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామినేని శ్రీనివాస్ క్షమాపణలు చెప్పాల్సిందే: Ysrcp డిమాండ్
అసెంబ్లీలో జగన్‌పై విమర్శలు చేసిన బీజేపీ చేసిన కామినేని శ్రీనివాస్ క్షమాపణల చెప్పాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan)పై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్(BJP MLA Kamineni Srinivas) విమర్శలు చేశారని, వెంటనే క్షమాపణ చెప్పాలని Ysrcp ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, విరూపాక్షి, శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ నాయకుడిని అసెంబ్లీలో అవమానించి ఇప్పుడు రికార్డుల నుంచి తొలగించమంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. సభలో లేని జగన్‌పై విమర్శలు సరికాదన్నారు. ఇందుకు కామినేని వెంటనే బహిరంగ క్షమాపణ కోరాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఆ తర్వాత మాట మార్చడం కూటమి ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. సినీ ప్రముఖులకు జగన్ అవమానపర్చలేదని చెప్పారు. గతంలోనే చిరంజీవి ఈ విషయాన్ని చెప్పినా జగన్‌ని నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామినేని శ్రీనివాస్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని చంద్రశేఖర్, విరూపాక్షి, శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు.






