- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Assembly : గవర్నర్ ప్రసంగం బాయ్‌కాట్.. వైసీపీ వాకౌట్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (AP Assembly Budget Sessions) ఆరంభంలోనే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (AP Assembly Budget Sessions) ఆరంభంలోనే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ (Jagan in Assembly) సహా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul nazeer speech) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. పెద్దఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభా హక్కులను కాపాడాలని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆందోళన చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వని నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి, అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే జగన్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
కాగా.. సమావేశాలకు ముందు గేట్ నంబర్ 4 వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అక్కడి నుంచి జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ లోపలికి వెళ్లారు. చాలాకాలం తర్వాత జగన్ అసెంబ్లీకి రావడంతో ఏం మాట్లాడుతారో అన్న ఆసక్తి నెలకొనగా.. కొద్దినిమిషాలకే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లగానే జగన్ తన కాన్వాయ్ లో వెళ్లిపోయారు. పేరుకు వచ్చాం అనిపించుకునేందుకు వచ్చినట్లుగా ఉందని సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. కాగా.. అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు మాత్రమే హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
TG Assembly: ప్రభుత్వ మార్పుతో రాష్ట్ర పురోగతికి విఘాతం.. గవర్నర్ అబ్దుల్ నజీర్ సంచలన వ్యాఖ్యలు






