- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్న హయాంలో అన్యాయం.. జరిగింది చెప్పి చెల్లి వద్ద వాపోయిన బాధితులు
పోలవరం నిర్వాసితులకు తామే న్యాయం చేశామనే చెప్పుకునే వైసీపీ నాయకులకు గట్టి షాక్ తగిలింది....

దిశ, వెబ్ డెస్క్: పోలవరం నిర్వాసితుల(Polavaram residents)కు తామే న్యాయం చేశామనే చెప్పుకునే వైసీపీ(Ycp) నాయకులకు గట్టి షాక్ తగిలింది. వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో జరిగిన సర్వేపై బాధితులు అభ్యంతరం వక్తం చేశారు. అంతేకాదు ఆయన సోదరి, రాష్ట్ర కాంగ్రెస్(Congress) పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(Ys Sharmila)కు దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కోరారు. జగన్ హయాంలో పోలవరం ముంపు గ్రామాలను సర్వే చేశారని, కానీ సక్రమంగా చేయలేదని తెలిపారు. అంతేకాదు ఆర్ అండ్ బీ ప్యాకేజీ విషయంలోనూ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ రీ సర్వే చేసి కొత్త ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఆమోదయోగ్యం కాని ముంపు భూములు ఇచ్చారని షర్మిల ఎదుట నిర్మాసితులు వాపోయారు.
కాగా పోలవరం కోసం భూములు ఇచ్చి పరిహారం, పునరావసం కోసం బాధితులు ఇంకా ఎదురు చూస్తున్నారు. పునరావాల్లో ఇళ్లు నిర్మించినా మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో అవి అసంపూర్తిగానే మిగిలిపోయాయి. మరోవైపు వర్షాలు పడి ముంపు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. ఈ సమస్యలతోనే సతమతవుతున్న బాధితులకు జగన్ చేసిన సర్వే మరింత బాధల్లోకి నెట్టింది. పోలవరం ముంపు గ్రామాల్లో అప్పటి సీఎం జగన్ సర్వే చేయించారు. ముంపు పరిహారం ప్యాకేజ్ ఎంతనేది నివేదించారు. అయితే ఈ ప్యాకేజ్ విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. రీ సర్వే చేసి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్యాకేజ్ ప్రకటించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా వైఎస్ షర్మిల దృష్టికి తీసుకెళ్లారు.






