రూ.3 కోట్లు ధ‌ర్మం చేయండి: విశాఖలో వైసీపీ వినూత్న నిరసన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-26 12:13:15  IST  )

విశాఖ కేజీహెచ్‌కు రూ. 3 కోట్లు ధర్మం చేయండంటూ వైసీపీ వినూత్న నిరసనకు దిగింది...

రూ.3 కోట్లు ధ‌ర్మం చేయండి: విశాఖలో వైసీపీ వినూత్న నిరసన
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ కేజీహెచ్‌(Visakhapatnam KGH)కు ప్రతినిత్యం రోగుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అత్యాధునిక పరికరాలతో వైద్యులు వైద్యం అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో అభివృద్ధి మాత్రం పడకేసింది. నిధుల కొరతతో ఆస్పత్రిలో పలు చోట్ల గదులు ఆధ్వాన్నంగా ఉన్నాయి. దీంతో నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే ఆస్పత్రి సిబ్బంది కోరింది. నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) నిరసనకు దిగింది. రూ. 3 కోట్లు దానం చేయాలని, కూటమి నాయకులు కేజీహెచ్ ఆస్పత్రి వద్ద భిక్షాటన చేస్తున్నట్లు వినూత్న నిరసన చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాసుపల్లి గణేశ్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టిన ఆ పార్టీ శ్రేణులు.. ఎన్నికలకు ముందు చెప్పిన సంపద సృష్టి ఎక్కడ అంటూ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎన్నుకుంది ఎందుకంటూ వినూత్నంగా ఆందోళన నిర్వహించారు.

Next Story