టీటీడీ చైర్మన్ కనబడుటలేదు: తిరుపతిలో వైసీపీ నేతల వినూత్న నిరసన

by Ramesh Naini |

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిపాలన భవనం వద్ద బుధవారం ఉదయం వినూత్న నిరసన చోటుచేసుకుంది.

టీటీడీ చైర్మన్ కనబడుటలేదు: తిరుపతిలో వైసీపీ నేతల వినూత్న నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిపాలన భవనం వద్ద బుధవారం ఉదయం వినూత్న నిరసన చోటుచేసుకుంది. ‘టీటీడీ చైర్మన్ కనబడుటలేదు’ అంటూ రాసి ఉన్న భారీ ఫ్లెక్సీని టీటీడీ పరిపాలన భవనం ప్రధాన ద్వారం వద్ద ప్రదర్శించడం కలకలం రేపింది. టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు భక్తులకు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు ఈ నిరసన చేపట్టారు. ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్, పసుపులేటి సురేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ విభాగం అధ్యక్షుడు వాసు యాదవ్, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Next Story