- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ డీజీపీ ఆఫీసు ఎదుట వైసీపీ నేతల ధర్నా
మందా సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సెగలు ఒక్కసారిగా డీజీపీ కార్యాలయానికి (DGP Office) చేరాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ (YCP) కార్యకర్త మందా సాల్మన్ (Manda Salmon) హత్యకు నిరసనగా ఆ పార్టీ అగ్రనేతలు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వద్ద భారీ ధర్నాకు దిగారు. సోమవారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోపలికి అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు, పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. బాధితులకు న్యాయం చేయాలని కోరడానికి వస్తే కనీసం లోపలికి రానివ్వరా అంటూ అధికారులపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. వినతిపత్రం ఇచ్చే హక్కు కూడా లేదా అని వైసీపీ నేతలు పోలీసులను ప్రశ్నించారు.
మందా సాల్మన్ హత్య ముమ్మాటికీ రాజకీయ కక్షలతో కూడిన హత్యేనని ఆరోపించారు. దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి వచ్చిన సాల్మన్‌ను ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టి చంపడం హేయమైన చర్య అని వారు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. హత్య చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. డీజీపీ స్వయంగా స్పందించి నిస్పక్షపాత విచారణ జరిపించాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం మానుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని నేతలు ఖరాఖండిగా చెప్పారు.






