విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద వైసీపీ నేతల హంగామా

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-26 09:10:10  IST  )

విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద వైసీపీ నేతలు హంగామా సృష్టించారు..

విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద వైసీపీ నేతల హంగామా
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court) వద్ద వైసీపీ నేతలు హంగామా చేశారు. రిమాండ్ గడువు ముగియడంతో లిక్కర్ కేసు(Liquor Case)లో ఎంపీ మిథున్ రెడ్డి(Mp Mithun Reddy)ని రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail) నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే కోర్టు వద్దకు వైసీపీ(Ycp) నేతలు భారీగా తరలివచ్చారు. జై జగన్.. జై మిథున్‌రెడ్డి అంటూ పెద్ద పెద్దగా నినాదాలు చేశారు. పోలీసులు, జైలు సిబ్బంది పక్కకు నెడుతున్నా భారీగా గుమిగూడారు. మిథున్ రెడ్డితోపాటు కోర్టులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే వాళ్లందరిని పక్కకు నెట్టి ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం మిథున్ రెడ్డి రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డిని భారీ బందోబస్తు మధ్య మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Next Story