జగన్ పర్యటనలో సెక్యూరిటీ వైఫల్యం.. గవర్నర్‌కు వైసీపీ నాయకుల ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-26 13:59:04  IST  )

మాజీ ముఖ్యమంత్రి జగన్ సెక్యూరిటీ వైఫల్యంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....

జగన్ పర్యటనలో సెక్యూరిటీ వైఫల్యం.. గవర్నర్‌కు  వైసీపీ నాయకుల ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి జగన్(Former Chief Minister Jagan) సెక్యూరిటీ వైఫల్యంపై వైసీపీ(Ycp) నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. పొదిలి, రెంటపాళ్ల పర్యటనల్లో చోటు చేసుకున్న పరిణామాలపైనా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌(Governor Abdul Nazir)ను కలిశారు. సింగయ్య మృతికి సంబంధించిన కేసుపైనా బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సహా తదితర వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ నాయకుడిపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందునే తమ నేతలపై కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. సింగయ్య మృతి వ్యవహారంలో ప్రభుత్వం ఒత్తిడితోనే జగన్‌పై కేసు నమోదు చేశారని, వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Next Story