YSRCP : వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్ పై వేటు

by Y. Venkata Narasimha Reddy |

వైసీపీ(YSRCP) నేత వడిత్య శంకర్ నాయక్(Vaditya Shankar Naik )పై బహిష్కరణ(Suspended)వేటు పడింది.

YSRCP : వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్ పై వేటు
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ(YSRCP) నేత వడిత్య శంకర్ నాయక్(Vaditya Shankar Naik )పై బహిష్కరణ(Suspended)వేటు పడింది. వైసీపీ అధినేత, మాజీ సీఎంవైఎస్ జగన్ ఆదేశాల మేరకు శంకర్ నాయక్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం విజయవాడ స్పా సెంటర్ లో శంకర్ నాయక్ పోలీసుల దాడిలో పట్టుబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ నాయక్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీ కమిషన్ సభ్యుడుగా పని చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన శంకర్ నాయక్ విజయవాడ మసాజ్ సెంటర్ లో పోలీసులకు పట్టబడ్డాడు.

ఈ దాడులలో ఆయనతో పాటు 11మంది విటులు, తొమ్మిది మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. పోలీసులు దాడి జరిపిన సమయంతో మంచం కింద దాక్కున్న శంకర్ నాయక్ వారి హెచ్చరికలతో బయటకు వచ్చాడు.

ఇందుకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో శంకర్ నాయక్ ను పార్టీ నుంచి వైసీపీ నాయకత్వం బహిష్కరించింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో దారుణ ఓటమి తర్వాతా వైసీపీ పార్టీకి ఓ వైపు వలసలు..మరోవైపు నేతల కేసులు తలనొప్పిగా తయారయ్యాయి.

Next Story