- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీఆర్వోపై వైసీపీ నేత తిట్లదండకం.. సచివాలయానికి ఉరేసి చంపుతానంటూ బెదిరింపులు
by Naga Rani Yarlagadda |
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల ఇన్ఛార్జి వీఆర్వో గంధం అరుణ్ రెడ్డిపై బొల్లాపల్లి మండలం వైసీపీ కన్వీనర్ కాకర్ల నారాయణరెడ్డి..

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ వీఆర్వోను వైసీపీ నేత నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా ఉరేసి చంపుతానని బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల ఇన్ఛార్జి వీఆర్వో గంధం అరుణ్ రెడ్డిపై బొల్లాపల్లి మండలం వైసీపీ కన్వీనర్ కాకర్ల నారాయణరెడ్డి తిట్ల దండకంతో బెదిరింపులకు పాల్పడ్డారు. సర్టిఫికెట్ ను ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలని, లేదంటే సచివాలయానికి ఉరేసి చంపుతానంటూ బూతుపురాణం అందుకున్నారు. వీఆర్వో ఆయనకు ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా వినకుండా నోటికొచ్చినట్లు తిట్టారు. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్ కావడంతో ఆ వీఆర్వోకు రక్షణ కల్పించడంతో పాటు.. సదరు వైసీపీ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






