- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ నేత శిల్పా చక్రపాణికి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన సన్నిహితుడు
కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ నేత శిల్పా చక్రపాణికి బిగ్ షాక్ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ నేత శిల్పా చక్రపాణి(YSRCP leader Shilpa Chakrapani)కి బిగ్ షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు పీపీ ప్రదీప్ రెడ్డి(PP Pradeep Reddy) తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరారు. దీంతో నంద్యాల జిల్లా(Nandyal District) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జి(YCP Parliament Social Media Incharge)గా ప్రదీప్ రెడ్డి పని చేశారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన పని చేశారు. శిల్పా చక్రపాణిపై టీడీపీ నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. అలాంటి ప్రదీప్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య విలువలు, ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు తెలుగుదేశంలో చేరినట్లు ప్రదీప్ రెడ్డి చెప్పడం కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.






