- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లను విడిపించండి.. ప్లీజ్: వైసీపీ ఎంపీ ఆవేదన
విజయనగరం జిల్లాకు చెందిన మత్య్సకారులను బంగ్లా నుంచి విడిపించాలని కేంద్రమంత్రికి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మత్య్సకారులు(AP fishermen) బంగ్లాదేశ్(Bangladesh)లో బందీ అయిన విషయం తెలిసిందే. అయితే వారిని విడిపించాలని వైసీపీ ఎంపీ గురుమూర్తి(YSRCP MP Gurumurthy) కోరుతున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి జయశంకర్(Union Minister Jayashankar)కు లేఖ రాశారు. బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతున్న 9 ఉత్తరాంధ్ర మత్య్సకారులను విడిపించేందుకు కృషి చేయాలని లేఖలో కోరారు.
చేపల వేటకు వెళ్లి బందీలుగా మత్య్సకారులు
కాగా విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్య్సకారులు 2025, అక్టోబర్ 13న విశాఖ వద్ద సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జిల్లాలోకి ప్రవేశించారు. దీంతో మత్య్సకారులను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఏపీ మత్య్సకారులు అక్కడే బంధీలుగా ఉన్నారు. అయితే వారి యోగక్షేమాలపై కుటుంబ సభ్యులు ఆందోళనలు వ్యక్తం చేశారు. దీంతో మత్య్సకారుల విడుదలకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి స్పందించి కేంద్రమంత్రి లేఖ రాశారు. 8 మంది మత్య్సకారులను ఇండియాకు తీసుకురావాలని కోరారు.






