Ap News: మంత్రి లోకేశ్, బీటెక్ రవిపై సంచలన ఆరోపణలు..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-09 10:38:16  IST  )

మంత్రి లోకేశ్, బీటెక్ రవిపై వైసీపీ నేత సతీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు...

Ap News:  మంత్రి లోకేశ్, బీటెక్ రవిపై సంచలన ఆరోపణలు..!
X

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల(Pulivendula ZPTC Elections) వేళ వైయస్సార్ సీపీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి(SV Satish Kumar Reddy) విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. తనపై దాడి జరగబోతోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు అందుకు బాధ్యత మంత్రి లోకేష్(Minister Lokesh), పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి(Pulivendula Tdp Leader Btech Ravi)దేనని చెప్పారు. అలాగే వారిద్దరినీ సుమోటోగా తీసుకుని సీబీఐ(Cbi)తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తనపై జరగబోయే దాడికి సంబంధించి టీడీపీ నేతలే సమాచారం ఇచ్చారని తెలిపారు. పులివెందులలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారంటూ సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

సతీశ్ రెడ్డి వీడియో

Next Story