YSRCP:పార్టీ శ్రేణులకు వైసీపీ నేత సజ్జల కీలక పిలుపు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లో ‘‘బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ’’ కార్యక్రమాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు.

YSRCP:పార్టీ శ్రేణులకు వైసీపీ నేత సజ్జల కీలక పిలుపు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ‘‘బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ’’ కార్యక్రమాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో మంచి స్పందన వచ్చిందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అని పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపునిచ్చారు.

పార్టీని(YSRCP) బలోపేతం దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మండల స్థాయి నాయకులు క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. ఈ క్రమంలో వచ్చే నెల(ఆగస్టు) చివరి నాటికి గ్రామస్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా గత ఐదేళ్లు వైసీపీ పనిచేసిందని సజ్జల తెలిపారు.

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందన్నారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయన విమర్శించారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారని అన్నారు. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఈ క్రమంలో సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలను చైతన్య పరచాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Next Story