- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది మా సంకల్పం.. ప్రైవేట్ పరం చేయొద్దు: సజ్జల రిక్వెస్ట్
అది తమ సంకల్పమని ప్రైవేట్ పరం చేయొద్దని వైసీపీ నేత సజ్జల రిక్వెస్ట్ చేసింది..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు వైఎస్ జగన్(Ys Jagan) విజన్ అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(YSRCP leader Sajjala Ramakrishna Reddy) అన్నారు. పేదలకు మేలు చేయాలని మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. నాలుగు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఉండాలనే సంకల్పంతో పనులు చేపట్టమన్నారు. అయితే ఆ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ఏం లాభం వస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న పీపీపీ నిర్ణయంతో విద్య, వైద్యం మొత్తం ప్రైవేటు పరం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే ఆరోగ్య శ్రీ ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. చంద్రబాబు తీసుకున్న పీపీపీ విధానం పెద్ద స్కామ్ అని ఆరోపించారు. తమ హయాంలో మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకురావడానికి చాలా కష్టపడ్డామన్నారు. ఉత్తమ మెడికల్ హబ్‌గా రాష్ట్రాన్ని మార్చాలని అనుకున్నామని చెప్పారు. ప్రైవేటు పరం చేస్తే ఉచితంగా వైద్యం అందిస్తారా...? అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం చేసిన అప్పుల్లో కొంత పెట్టినా మెడికల్ కాలేజీలు పూర్తి అవతాయని సజ్జల రామకృష్ణారావు వ్యాఖ్యానించారు.






