- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలనను వదిలేసి ‘యోగా’ అంటూ తిరుగుతున్నారు: చంద్రబాబుపై సజ్జల ఫైర్
సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu)పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(YSRCP leader Sajjala Ramakrishna Reddy) ఫైర్ అయ్యారు. విశాఖలో నిర్వహించిన ‘యోగా డే’(Yoga Day)లో చంద్రబాబు పాల్గొనడంపై ఆయన విమర్శలు కురిపించారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేసి యోగా అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసేదానికి ఎదుటివారిని బాధ్యులను చేస్తారన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ నేతలే బాధ్యులంటున్నారని, మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడంలేదని, డ్రగ్స్(Drugs), గంజాయి(Ganjai) నిర్మూలించడంలో విఫలమయ్యారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
Next Story






