అది మట్టి కుప్ప.. అమరావతిపై సజ్జల హాట్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |

ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మట్టికుప్పతో పోల్చారు. అమరావతి చట్టబద్ధతపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు వెళ్లి అదే మట్టి కుప్పపై పడుకుని అదే స్టోరీ చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు...

అది మట్టి కుప్ప.. అమరావతిపై సజ్జల హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మట్టికుప్పతో పోల్చారు. అమరావతి చట్టబద్ధతపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు వెళ్లి అదే మట్టి కుప్పపై పడుకుని అదే స్టోరీ చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సీఎం చంద్రబాబును భూమిపై పడుకుని ప్రార్థించిన తీరును సజ్జల తప్పుబట్టారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్‌పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని పేరుతో రాష్ట్రంపై మోయలేని భారాన్ని మోపుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని పూనకం వచ్చినట్లు రిస్టార్ట్ చేశారని ఆరోపించారు. రాజధానిని పేకముక్కలతో పోల్చి వెటకాలాడారన్నారు. ఎలాంటి అవకాశం దొరికినా దోపిడీ చేయడం చంద్రబాబుకు అలవాటు అని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారు. రాజధాని పేరుతో మోటారు పెట్టి నీటిని తోడినట్లు ప్రజల సొమ్మును లాగేసుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. 2019లో చంద్రబాబు హయాంలో పోయేటప్పటికి భారీ దోపిడీ, అవినీతి జరిగిందని తెలిపారు. జగన్ చేసిన మావిగన్ రాష్ట్ర ప్రజలపై భారముండదని సజ్జల వ్యాఖ్యానించారు.

Next Story