రప్పా రప్పా నరుకుతాం.. అజ్ఞాతంలో పేర్ని నాని?

by Naga Rani Yarlagadda |

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఈనెల 8న పామర్రులో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

రప్పా రప్పా నరుకుతాం.. అజ్ఞాతంలో పేర్ని నాని?
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఈనెల 8న పామర్రులో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. రప్పా రప్పా నరుకుతాం అని చెప్పడమే కాకుండా రాత్రికి రాత్రే అంతా చేసేయాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో పేర్ని నాని రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడారంటూ.. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలియడంతో ముందస్తు బెయిల్ (Anticipatory Bail) కోసం హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు. పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు తదుపరి విచారణను జులై 22కి వాయిదా వేసింది. ఈ క్రమంలో పేర్నినాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. రేపు హైకోర్టు విచారణ ఉండటంతో.. అక్కడికి వస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారని తెలుసుకునేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Next Story