ఏపీ సూడాన్‌ అయిపోతుంది: కాసు మహేశ్ రెడ్డి

by Vemula.Srinu Prasad |

ఏపీ సూడాన్‌ అయిపోతుందని వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి విమర్శలు చేశారు..

ఏపీ సూడాన్‌ అయిపోతుంది: కాసు మహేశ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఆర్థికంగా లోటు ఉన్నా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇందుకు కేంద్రం కూడా ఆర్థిక సాయం చేస్తోంది. అయితే అప్పులు పెరుగుతున్నాయని వైసీపీ(Ycp) ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సైతం ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జగన్‌(Jagan) ఐదేళ్లలో రూ.3.30 లక్షల కోట్ల అప్పు చేస్తే ఏపీ శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారని మండిపడ్డారు. కూటమి ఏడాదిలో 1.60 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఇలానే అప్పులు చేస్తే ఏపీ సూడాన్‌ అయిపోతుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి(Former MLA Kasu Mahesh Reddy) తెలిపారు.

Next Story