- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిలాఫలకం ధ్వంసం.. వైసీపీ నేత జగన్మోహన్ అరెస్ట్
by Jakkula.Mamatha |
ఏపీ(Andhra pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. గాండ్లపెంట మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలు ధ్వంసం అయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ చేయగా, వైసీపీ నేతలే ధ్వంసం చేశారని నిర్ధారణ అయింది. ఈ క్రమంలో మాజీ ఎంపీపీ, వైసీపీ నేత జగన్మోహన్‌తో పాటు మరికొందరు ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు(Police) జగన్మోహన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో ఫేక్ కేసు నమోదు చేశారంటూ ఆరోపిస్తూ.. పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేతలు(YCP Leaders) హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందు రెచ్చిపోయిన వైసీపీ నేతలకు పోలీసులు ధీటుగా సమాధానం ఇచ్చారు.
Next Story






