- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు తెనాలికి జగన్.. ఆ కుటుంబానికి పరామర్శ
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 3వ తేదీ (రేపు) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 3వ తేదీ (రేపు) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి.. 11.15 గంటలకు తెనాలిలోని ఐతానగర్ కు చేరకుంటారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడిన జాన్ విక్టర్ కుటుంబీకులని పరామర్శించి.. భరోసా ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయల్దేరి 1.15 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
కాగా.. రాష్ట్రంలో ప్రజల వద్దకే వెళ్లి సేవలందించే ఇంటింటికీ రేషన్ సదుపాయాన్ని తీసివేయడంపై అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. దేశమంతా మెచ్చిన రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడం అంటే.. పేదల్ని దోపిడీ చేసేందుకు మళ్లీ డోర్లు తెరిచినట్లు కాదా అని ప్రశ్నించారు. పేదలపై ఎందుకంత కక్ష అని, రేషన్ కష్టాల్ని మళ్లీ ఎందుకు తీసుకువస్తున్నారు అని నిలదీశారు. డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా ? సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.






