వైసీపీ నేత రాసలీలల వీడియో వైరల్.. స్వయంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వైనం

by Malleboina Mahesh |

వైసీపీ పార్టీకి చెందిన నేత రాసలీలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైసీపీ నేత రాసలీలల వీడియో వైరల్.. స్వయంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వైనం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ పార్టీకి చెందిన నేత రాసలీలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడి (YCP BC cell president)గా ఉన్న ఫనీంద్ర, ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో స్వయంగా వీడియో తీసుకున్నాడు. అనంతరం ఈ వీడియోను తానే స్వయంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఈ వీడియో క్షణాల్లోనే జిల్లావ్యాప్తంగా వ్యాపించడంతో పార్టీ శ్రేణుల్లో, స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అయితే కొద్దిసేపటికి తేరుకున్న ఫనీంద్ర తప్పును గుర్తించిన తాను షేర్ చేసిన ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల నుంచి డిలీట్ చేశాడు.

కానీ అప్పటికే ఈ వీడియో వేల మంది చేతుల్లోకి వెళ్లి వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో, వైసీపీ నేత ఫనీంద్ర వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తన మొబైల్ ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని, ఈ వీడియోను తాను షేర్ చేయలేదని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఫోన్ హ్యాక్ అయినా.. మరో మహిళతో ఉన్న రాసలీలల చేస్తూ అతను ఎందుకు వీడియో తీసుకున్నాడని, ఇదేమి పద్దతని సోషల్ మీడియాలో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ ఘటనపై వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Next Story