లిక్కర్‌ కేసులో చెవిరెడ్డికి చుక్కెదురు.. బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌

by Vemula.Srinu Prasad |

ఏపీ లిక్కర్‌ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డికి చుక్కెదురయింది.....

లిక్కర్‌ కేసులో చెవిరెడ్డికి చుక్కెదురు.. బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్‌ కేసు(AP Liquor Case)లో వైసీపీ నేత చెవిరెడ్డి(YSRCP leader Chevireddy)కి చుక్కెదురయింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌‌ను విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court) డిస్మిస్‌ చేసింది. ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డిని అరెస్ట్ చేసి జైలు(Prison)కు తరలించారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. లిక్కర్ కేసు నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని సిట్ వాదనలు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.

Next Story