- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైల్లోనే 226 రోజులు.. తాజాగా విడుదల
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Ycp Leader Chevireddy Bhaskar Reddy)ని అరెస్ట్ చేసిన జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు అయింది. దీంతో విజయవాడ జైలు(Vijayawada Jail) నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల అయ్యారు. మొత్తం 226 రోజులుగా జైల్లో ఉన్నారాయన, తాజాగా విడుదల కావడంతో జైలు వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ప్లకార్డులతో సంఘీభావం పలికారు. జైలు వద్ద చెవిరెడ్డిని కుటుంబ సభ్యులు, వైసిపి నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, జోగి రమేష్ కలిశారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా తనకు జైలు తప్పదన్నారు. చంద్రగిరి నుంచి ఎదిగినందుకే తనను ఆయను వేధిస్తున్నారని తెలిపారు.చంద్రబాబు పుట్టిన గ్రామంలో తాను పుట్టడం తప్పా అని చెవిరెడ్డి ప్రశ్నించారు.






