- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Liquor Case: మళ్లీ కోర్టుకు చెవిరెడ్ది.. ఈసారి కూడా అందుకే ..?
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన బెయిల్‌పై పట్టువిడవని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(YSRCP leader Chevireddy Bhaskar Reddy) తన బెయిల్(Bail)పై పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. లిక్కర్ కేసు(Liquor Case)లో ఆయన అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే జైలులో నుంచే తన బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కోర్టులో పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా సరే తాజాగా మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తన తరపున విజయవాడ ఏసీబీ కోర్టులో న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు రేపో, ఎల్లుండో విచారణ చేపట్టనుంది.
ఇక ఇదే కేసులో A8 నిందితుడిగా ఉన్న చాణక్య బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. కేసు విచారణ దశలో ఉండగా బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో చాణక్యకు ఎదురుదెబ్బ తగిలింది.






