- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెవిరెడ్డికి బిగ్ షాక్.. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది....

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(YSRCP leader Chevireddy Bhaskar Reddy)కి బిగ్ షాక్ తగిలింది. ఆయన ఆస్తుల అటాచ్‌మెంట్(Assets Attachment)కు ప్రభుత్వం అనుమతించింది. లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case)లో చెవిరెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే చెవిరెడ్డి అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు సిట్ గుర్తించింది. రూ. 63 కోట్లకు పైగా అక్రమంగా కూడబెట్టినట్లు ప్రభుత్వానికి సిట్ నివేదించింది. ఈ మేరకు చెవిరెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో చెవిరెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చెవిరెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ కేసులో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆస్తుల అటాచ్‌మెంట్ ఆయనకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లైంది.






