- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Liquor Case: జడ్జి ఎదుట గగ్గోలు పెట్టిన చెవిరెడ్డి
విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Ycp Leader Chevireddy Bhaskar Reddy) మరోసారి జడ్జి ఎదుట గగ్గోలు పెట్టారు. ఏపీ మద్యం కేసు(Ap Liquor Case)లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఆయన విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court) జడ్జి ఎదుట హాజరయ్యారు. తనకు, మద్యం కేసుకు ఎలాంటి సంబంధం లేదని జడ్జీ ఎదుట మళ్లీ చెప్పారు. తనపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని, అందులో భాగంగానే అక్రమంగా కేసు నమోదు చేసిందని తెలిపారు. మద్యం అమ్మకాల నుంచి తనకు ఒక్క రూపాయి రాలేదన్నారు. తాను మద్యం వ్యాపారం చేయలేదని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆస్తులు సంపాదించుకున్నానని చెప్పారు. కష్టపడి సంపాదించుకున్న తన ఆస్తులు అటాచ్ మెంట్ చేయడం అన్యామని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టినా ఉంటానని జడ్జి ఎదుట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. అయితే చెప్పుకోవాల్సినదేమైనా ఉంటే పిటిషన్ దాఖలు చేయాలని జడ్జి సూచించారు.






