మొబైల్ కోర్టులో విచారణ వాయిదా.. సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్

by Vemula.Srinu Prasad |

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ కుమార్ కేసు విచారణ వాయిదా పడింది..

మొబైల్ కోర్టులో విచారణ వాయిదా.. సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ కుమార్(YCP leader Borugadda Anil Kumar) కేసు విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌(Anantapur Three Town Police Station)లో నమోదైన కేసులో ఆయన్ను మొబైల్ కోర్టు(Mobile court)లో ప్రవేశపెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో అనిల్‌ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)కు తరలించారు.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrabu)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బోరుగడ్డ అనిల్ కుమార్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తల్లికి అనారోగ్యం కారణంగా ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగిసినా కూడా కోర్టుకు హాజరుకాలేదు. నకిలీ పత్రాలు సమర్పించి బెయిల్ గడువు పొడిగించుకోవాలని ప్లాన్ చేశారు. కానీ మెడికల్ సర్టిఫికెట్ నకిలీదని తేలడంతో కోర్టు సీరియస్ అయింది. ఈ మేరకు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయారు. ఆ తర్వాత రిమాండ్ గడువు పొడిగించడంతో అనిల్ కుమార్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఫాస్టర్‌ను బెదిరించారంటూ ఆయనపై గుంటూరు పట్టాభిపురం పీఎస్‌లో నమోదైన కేసులోనూ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదేకాక రాష్ట్రంలో పలుచోట్ల నమోదైన కేసుల్లో బోరుగడ్డ అనిల్ విచారణను ఎదుర్కొంటున్నారు. .

Next Story