Guntur: వైసీపీ నేత సజ్జల సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

వైసీపీ నేత, గత ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Guntur: వైసీపీ నేత సజ్జల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌(Nandigam Suresh)తో పాటు ఆ పార్టీ నేత తురకా కిషోర్(Turaka Kishore) గుంటూరు జిల్లా జైలు(Guntur District Jail)లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు నేతలను ఈ రోజు జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)తో పాటు మాజీ మంత్రి విడుదల రజినీ(Vidadala Rajini) పరామర్శించారు. అనంతరం జైలు బయట సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలపై ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలపై నిలదీస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇష్టారీతిన కథ అల్లుకుంటూ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) వరకూ వెళ్తారేమోనని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. నందిగం సురేశ్ పై ఇప్పటి వరకూ 12 కేసులు నమోదు చేశారని వ్యాఖ్యలు చేశారు. బెయిల్ తీసుకొని బయటకు వస్తే వెంటనే పాత కేసుల్లో మళ్లీ అక్కడికే పంపుతున్నారని మండిపడ్డారు. తురకా రమేశ్‌ను కూడా గత కేసులో బాధ్యుడిని చేస్తూ జైలుకు పంపారని సజ్జలఆరోపించారు.

రాజకీయ అవసరాల కోసం అధికార పార్టీ నాయకులు పోలీసులను వినిగించుకుంటున్నారని సజ్జల అన్నారు. తద్వారా మొత్తం పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందని ఆయన విమర్శించారు. తెనాలి ముగ్గురు యువకులపై పోలీసుల దాడి ఘటనపైనా సజ్జల విమర్శలు చేశారు. నడి రోడ్డుపై సీఐ వ్యవహరించిన తీరు ఆటవికమని ధ్వజమెత్తారు. శిక్షలన్నీ పోలీసులే అమలు చేస్తే ఇక న్యాయవ్యవస్థలు ఎందుకని సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ అండదండలతో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇదే కొనసాగితే సమాజంలో సామన్యుడు బతకం కష్టమని సజ్జల అసంతృప్తి వ్యక్తం చేశారు.

Next Story