- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు
మద్యం స్కాం (Liquor Scam) కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevi Reddy Bhaskar Reddy) నిందితుడిగా ఉన్న విషయం విదితమే.

దిశ, వెబ్ డెస్క్ : మద్యం స్కాం (Liquor Scam) కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevi Reddy Bhaskar Reddy) నిందితుడిగా ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో చెవిరెడ్డి బాధపడుతున్నారు. ప్రస్తుతం కొద్ది రోజుల నుంచి చర్మ సంబంధిత వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విషయాన్ని ఆయన జైలు అధికారులకు ఇటీవల తెలియజేశారు. ఆయన వినతిని పరిశీలించిన జైలు అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు తగిన వైద్య పరీక్షలను (Medical Tests) చేయించారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడ నుంచి తిరిగి జిల్లా జైలుకు తరలించారు. గత నెల కూడా వెరికోస్ వెన్స్ వ్యాధికి చికిత్స కోసం భాస్కర్ రెడ్డి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలను చేయించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.






