YSRCP : రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి విప్ జారీ చేసిన వైసీపీ

by Y. Venkata Narasimha Reddy |

ఏపీ(Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల(Corporators And Councilors)కి వైఎస్సార్సీపీ విప్(Whip )జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఖాళీయైన డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ రాష్ట్ర రాజకీయాల్లో( Politics) వేడి పుట్టించింది.

YSRCP : రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి విప్ జారీ చేసిన వైసీపీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల(Corporators And Councilors)కి వైఎస్సార్సీపీ విప్(Whip )జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఖాళీయైన డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ రాష్ట్ర రాజకీయాల్లో( Politics) వేడి పుట్టించింది. రేపు సోమవారం తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్ల ఎన్నికలు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ ల కోసం ఎన్నికలు, అలాగే బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్ పర్సన్ ల కోసం ఎన్నికలు జరగనున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో ఆయా పదవులను కైవసం చేసుకునేందుకు టీడీపీ (TDP) పావులు కదుపడంతో పెద్ధఎత్తున ఫిరాయింపులు, ప్రలోభాలకు తెర లేచింది. నయానా భయానా ఎన్నికల్లో విజయం కోసం అధికార కూటమి చేస్తున్న ప్రయత్నాలతో తమ పార్టీ కార్పోరేటర్లు, కౌన్సిలర్లు చేజారిపోకుండా అప్రమత్తమైన వైఎస్సార్సీపీ(YSRCP) పార్టీకి చెందిన కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది.

వైసీపీ విప్ ధిక్కరించే వారు ఎన్నికల కమిషన్ అనర్హత వేటుకు గురికానున్నారు. అయితే వైసీపీ జారీ చేసిన విప్ ను ఎంత మంది కార్పోరేటర్లు, కౌన్సిలర్లు తలొగ్గుతారు..మరెంత మంది బేఖాతార్ చేస్తారన్నది రేపు సోమవారం ఎన్నికల్లో తేలిపోనుంది. అటు కూటమి పార్టీలు..ఇటు వైసీపీ రెండు కూడా ఖాళీయైన డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకోవాలన్న పట్టుదలతో వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ ఎన్నికల ప్రక్రయ ఉత్కంఠగా మారింది. కొన్నిచోట్ల ఇప్పటికే క్యాంపు రాజకీయాలు నడిపించారు. మరోవైపు ఎన్నికలు జరుగుతున్న కార్పేరేషన్లు, మున్సిపాల్టీల్లో రాజకీయ వివాదాలు తలెత్తకుండా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలకు ఉపక్రమించింది.

Next Story