- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి రాజధాని లేకపోవడానికి కారణం వైసీపీనే.. కేంద్ర మంత్రి శ్రీనివాస రాజు ఫైర్
ఐదేళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా చేసిన ఘనత వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ (YSRCP)కే దక్కిందని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ (Union Minister Bhupathi Raju Srinivasa Varma) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా చేసిన ఘనత వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ (YSRCP)కే దక్కిందని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ (Union Minister Bhupathi Raju Srinivasa Varma) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆయన భీమవరం (Bhimavaram)లో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి (Amaravati) అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. ఎవరూ ఊహించని విధంగా ఏపీకి రాజధాని నిర్మాణం విషయంలో పూర్తి సహకారం అందజేస్తున్నామని అన్నారు. నిధుల కొర లేకుండా కేంద్ర ప్రభుత్వం (Central Government) చూసుకుంటుందని తెలిపారు. ఇక పహల్గాం టెర్రర్ అటాక్ (Pahalgam Terror Attack)పై పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions) నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం అసందర్భమని కామెంట్ చేశారు. ఉగ్రదాడిని రాజకీయంగా వాడుకోవాలని ప్రతిపక్షలు చూస్తున్నాయని.. అది ఏమాత్రం సరైంది కాదని భూపతిరాజు శ్రీనివాస వర్మ విపక్షాలకు చురకలంటించారు.
ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ ఇలా..
రేపు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఏపీ (AP)లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన రాజధాని అమరావతి (Amaravati)లో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా హైకోర్ట్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయ నిర్మాణాలకు ఇనాగ్యురేట్ చేయనున్నారు. ఇక డీఆర్‌డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఐ, రైల్వేస్‌కు సంబంధించి రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నాగాయలంకలో దాదాపు రూ.1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్‌కు, వైజాగ్ (Vizag)లో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్ (Unity Mall)కు, రూ.293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజక్టుకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా రూ.3,176 కోట్ల మేర నేషనల్ హైవే ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో అమరావతి వేదికగా వర్చ్యువల్ పాల్గొంటారు. రూ.254 కోట్లతో పూర్తి చేసిన ఖాజీపేట - విజయవాడ 3వ లైన్, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి, KUF పాణ్యం లైన్లను ఆయన ప్రారంభించనున్నారు.






